Pushpa 2:సెకండ్ సాంగ్ అదిరే న్యూస్!

12
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఆగస్టు 15 ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా సినిమా సెకండ్ సాంగ్‌కి సంబంధించిన అదిరే న్యూస్ వచ్చేసింది. మే 23న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి సెకండ్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

రష్మిక, అల్లు అర్జున్ పై ఈ సాంగ్ ఉండనుండగా ఈ భారీ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తోంది.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -