Pushpa 2:అందుకే ఆలస్యం..మేకర్స్ క్లారిటీ!

6
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” పుష్ప ది రూల్ “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే తాజాగా సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని మేకర్స్ సైతం స్పష్టం చేశారు. తాము సినిమా పూర్తి చేసేందుకు చాలా కష్టపడుతున్నామని ఒకపక్క షూటింగ్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా కూడా ఈ చిత్రానికి ఈ ఆగస్ట్ 15 రిలీజ్ కి రాలేదని చెప్పారు.

బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ తోనే రావాలని డిసైడ్ అయ్యామని అందుకే సినిమాని డిసెంబర్ రిలీజ్ కి ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

- Advertisement -