పుష్ప 2..రికార్డు బ్రేక్ పక్కా!

3
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ద, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్ సన్సేషన్‌ కలయికలో రాబోతున్న చిత్రం పుష్ప -2. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఒకరోజు ముందుగానే అంటే డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రీమూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని. వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదిని తెలియజేయడానికి గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఈ చిత్రాన్ని ఇండియా వైడ్‌ పంపిణీ చేస్తున్న నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, “పుష్ప-2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఇంతకు ముందు చెప్పిన దాని కన్నా ఒక రోజు ముందుగా, అంటే డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పుష్ప-2 కచ్చితంగా ఒక పెద్ద సినిమా గా మారింది. రిలీజ్ కూడా ఘనంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా అందరి అంచనాలకి మించి ఉండబోతుందని” అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, “ముందుగా హీరో గారి కి, డైరెక్టర్ గారికి, కాస్ట్ అండ్ క్రూ కి ధన్యవాదాలు. గత రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా ని ఈ రేంజ్ కి తీసుకొచ్చారు హీరో గారు. ఈ సినిమా కోసం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు. హీరో గారు, దర్శకుడు పగలు రాత్రి కష్టపడి ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ గారి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని మా అందరికీ నమ్మకం ఉంది. మా తోటి డిస్ట్రిబ్యూటర్లందరికీ అభినందనలు. మా అందరి ముందు పెద్ద గోల్స్ ఉన్నాయి. కానీ మేము అన్నిటినీ చక్కగా అచీవ్ చేస్తాం. డిసెంబర్ 5 న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వైజాగ్ నుంచి బళ్లారి సాయి గారు, సతీష్ గారు, ఈస్ట్ నుంచి రాయుడు గారు, కృష్ణ బన్నీ వాస్ గారు, ధీరజ్ గారు, వెస్ట్ ఎల్వీఆర్ గారు, గుంటూరు యువీ వంశీ గారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, సీడెడ్ అభిషేక్ రెడ్డి గారు మా టీమ్. మేమందరం ఈ సినిమా తో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం కోరుతున్నాం. సినిమా వర్క్ అంతా బాగా జరుగుతుంది.” అని చెప్పారు.

మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి మాట్లాడుతూ, “నైజం లో మేము ఈ సినిమా విడుదల చేస్తున్నాం. ఈ ఏరియా లో సినిమా పెద్ద నంబర్ ని అచీవ్ చేస్తుంది.” అన్నారు.

హిందీ కి సంబంధించి ఏఏ సినిమాస్, అనిల్ తడాని మాట్లాడుతూ, “పుష్ప -2 ని విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. బాహుబలి, కేజీఎఫ్ కూడా చేసాము. పుష్ప పార్ట్ 1 కూడా రిలీజ్ చేసాం. ఇప్పుడు పార్ట్ 2 తో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం.

Also Read;అద్భుతమైన మూవీ ‘కంగువ’:సూర్య

వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ గారు మాట్లాడుతూ “పుష్ప-2 కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మా జిల్లా లో డే 1 షేర్ ఏ కాకుండా టోటల్ బిజినెస్ కూడా ఆల్ టైం రికార్డ్ అవుతుంది అని కోరుకుంటున్నాను” అన్నారు.

తమిళ్ కి సంబంధించి ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పుష్ప ఒక బ్రాండ్ గా మారింది. తమిళ్ లో ఈ సినిమా కి పెద్ద రిలీజ్ ఇచ్చాం. పుష్ప-2 కి డబుల్ డిజిట్ ఓపెనింగ్ ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం. మేము ఇటీవలే 806 స్క్రీన్స్ లో విజయ్ గోట్ సినిమా విడుదల చేసాం. పుష్ప ని కూడా అన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. బాహుబలి 2 తమిళ్ లో 80 క్రోర్స్ షేర్ కలెక్ట్ చేసింది. పుష్ప ఆ నంబర్ ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను.” అన్నారు.

మలయాళం కి సంబందించిన ఈ4 ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూటర్ ముకేశ్ మెహతా మాట్లాడుతూ, “పుష్ప -2తో మేము 12 కోట్ల మార్క్ ని టచ్ చేయాలని అనుకుంటున్నాం. లియో కలెక్ట్ చేసిన నంబర్ అది. అంతే కాకుండా, 24 గంటలు ఈ సినిమా కి సంబందించిన షోస్ వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం.” అని తెలిపారు.

కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “కర్ణాటకలో క్రేజీ బిజినెస్ చేస్తాం. కర్ణాటకలో ఒక సినిమా చేసిన అత్యధిక బిజినెస్ 90-95 కోట్ల రూపాయలు. కర్నాటకలో అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప ఒక మైలురాయిగా నిలిచిపోయేలా చూస్తాం. దాదాపు 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసి నైట్ షోలు కూడా ప్లాన్ చేస్తాం. KGF 2 350 సింగిల్ స్క్రీన్‌లలో విడుదలైంది. పుష్ప 2 500 సింగిల్ స్క్రీన్లలో విడుదల కానుంది. KGF2 ఓపెనింగ్ డే కలెక్షన్ దాదాపు ₹30 కోట్లు. మేము దానిని ఖచ్చితంగా అధిగమిస్తాము” అన్నారు.

- Advertisement -