పుష్ప 2..ప్రీ రిలీజ్‌ బిజినెస్ షురూ!

76
pushpa 2
- Advertisement -

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. విడుదలైన ప్రతిచోటా తగ్గెదేలే అంటూ సెన్సేషన్ సృష్టించిన పుష్ప..సీక్వెల్‌ గురించి అంతరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

సెకండ్ పార్ట్ ని పుష్పరాజ్ ఎలా రూల్ చేస్తాడా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోగా ఆ అంచనాలను మించేలా పుష్ప2 తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇక ఈ అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా బిజినెస్ అప్పుడే మొదలైపోయింది.

పుష్ప 2 కోసం ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ. 300 కోట్లకి పైగా డీల్ జరిగిందని వార్తలు వినిపిస్తుండగా ఇప్పుడు డిజిటల్ రైట్స్ కలిపి రూ. 500 నుంచి రూ.600 కోట్లకి పైగా బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే సినిమా మొదలు కాకుండానే ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి.

- Advertisement -