Pushpa 2: ఓటీటీలోకి పుష్ప 2!

0
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప 2. విడుదలైన ప్రతిచోటా బ్లాక్ బాస్టర్ వసూళ్లను రాబడుతూ రికార్డులను తిరగరాస్తోంది పుష్ప 2. తొలి వారంలోనే దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన చిత్రంగా నిలిచింది పుష్ప 2.

ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్‌లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ , మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రెండు , మూడు నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేసింది. జనవరి 9 నుంచి పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది.

Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!

- Advertisement -