పుష్ప 2 ఓటీటీ డేట్ ఫిక్స్‌.. !

1
- Advertisement -

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా నిలిచింది.

ఇటీవ‌ల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేసి రీలోడెడ్ అంటూ విడుద‌ల చేయ‌గా దానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. కొత్త సీన్ల‌ను చూసేందుకు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు ప‌రుగులు పెడుతున్నారు.

పుష్ప‌2 చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 56 రోజుల త‌రువాత‌నే డిజిట‌ల్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ఇటివ‌ర‌కే ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే పుష్ప 2 చిత్రం గురువారం (జ‌న‌వ‌రి 30న‌) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిపింది. రీలోడెన్ వెర్ష‌న్‌ను స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో చూపిస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో అందులోబాటులోకి రానుంది.

Also Read:రవితేజ.. ‘మాస్ జాతర’

- Advertisement -