పుష్పరాజ్‌ను చూడటానికి వెయిట్‌ చేస్తున్నారు!

3
- Advertisement -

పుష్ప-2 ది రూల్‌ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు. డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఈవెంట్‌ సన్సేషన్‌ అవుతుంది. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్‌గా నిలిచింది. కొచ్చిలో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌ కూడా అక్కడ కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. తాజాగా ముంబయ్‌లో ‘పుష్ప-2’ హీరో, హీరోయిన్‌ నిర్మాతలు సందడి చేశారు. అక్కడ గ్రాండ్‌ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ” ఈ సినిమా విషయంలో నేను థాంక్స్‌ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు.. వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్‌ లేకుండా ఈ సినిమా సాధ్యపడేది కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్‌ తడానిజీ, భరత్‌ భూషణ్‌లకు థ్యాంక్స్‌.. పుష్ప చిత్రాన్ని కోవిడ్‌ టైమ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఫేస్‌ చేసి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా నా టెక్నిషియన్ల అందరికి కృతజ్ఞతలు. నా చిన్ననాటి స్నేహితుడు నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్క్షతలు. త్వరలోనే పుష్ప-2 నుంచి మరో సూపర్‌ సాంగ్‌ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్‌ మరో సారి తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్‌ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గ్రేట్‌గా వుంది. శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో హ్యపీ. గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను. ఆమెతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స ఎంతో ఎనర్జీ వస్తుంది. చాలా పాజిటివ్‌ ఎనర్జీ ఉన్న హీరోయిన్‌. ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది. నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల ప్రయాణం మొదలైంది. పుష్ప ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం నన్ను స్టార్‌ను చేసింది సుకమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నాడు. ఈ సినిమా ఇంత డబ్బు వస్తుంది.. ఇంత పేరు వస్తుందని లెక్కలు వేసుకోని చేయలేదు. ప్రేక్షకులకు ఓ బెస్ట్‌ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ సినిమా ఇవ్వాలని వర్క్‌ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్‌ ప్రొడక్ట్‌ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బెస్ట్‌ సినిమా ఇస్తున్నాం. మేము పుష్ప పార్ట్‌-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే. ఈ రోజు ప్రపంచంలోని ప్రతి దగ్గరి నుంచి, ప్రపంచంలో ప్రతి ఇండియన్‌, ప్రతి భాష వాళ్లు, ప్రతి రాష్రంలోని వాళ్లు అందరూ కలిసి పుష్ప-2 విడుదలను సెలబ్రేట్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు.

రష్మిక మందన్నా మాట్లాడుతూ ” ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఎమోషన్స్‌ వున్నాయి. పుష్ప దిరైజ్‌లో నా పై చిత్రీకరించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్‌తో యాక్ట్‌ చేయడం అనగానే.. ఎలా రియాక్ట్‌ అవ్వాలో అర్థం కాలేదు. చాలా నెర్వస్‌ అయ్యాను. కానీ ఈ రోజు అల్లు అర్జున్‌ ఫ్యామిలీ మెంబర్‌ గా ఉన్నాను. లాట్‌ ఆఫ్‌ ఎమోషన్ష్‌ ఈ సినిమా చిత్రీకరణలో వున్నాయి. ఈ ఐదు సంవత్సరాల ప్రయాణం ఎంతో బాండింగ్‌ ఏర్పడింది. డిసెంబర్‌ 5న మా చిత్రం వస్తుందని గర్వంగా చెబుతున్నాను. సుకుమార్‌ లాంటి జీనియస్‌ దర్శకుడుతో పనిచేయడం ఎంతో ప్రౌడ్‌గా ఉంది. అతను మేధస్సు మనలా సాధారణ వ్యక్తి లా ఆలోచించడు. ఆయన సెపరేట్‌ సెవన్‌ ఇయర్స్‌ పుష్ప ఈజ్‌ మై హోమ్‌ లా అనిపించింది. ఇలాంటి గొప్ప టీమ్‌తో ఎన్ని సార్లు అయినా పనిచేయడానికి రెడీగా ఉంటాను’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ” హ్యజూ రెస్పాన్స్‌. ఎక్కడి వెళ్లినా అనూహ్యమైన రెస్పాన్స్‌ వస్తుంది. వీ నెవర్‌ ఎక్స్‌పెక్టేట్‌డ్‌ .. ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్లినా గొప్ప ఆదరణ లభిస్తుంది. సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో సినిమాను విడుదల చేస్తున్నాం…హ్యయెస్ట్‌ రిలీజ్‌ ఫర్‌ ఐమ్యాక్స్‌ వెర్షన్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్.. పుష్ప మాకు వెరీ స్పెషల్‌ సినిమా. ఈ సినిమా కోసం మూడు సంవత్సరాలు దర్శకుడు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. మెస్ట్‌ హార్డ్‌వర్కింగ్‌ హీరో. మాకు ఇలాంటి గొప్ప సినిమా ఇచ్చినందుకు దర్శకుడు, హీరోకు అనిల్‌ తడాని హిందీలో విడుదల చేస్తున్న భూషణ్‌ కుమార్‌ టీసీరిస్‌కు మా కృతజ్క్షతలు. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్‌ హార్డ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం దర్శకుడు సుకుమార్‌ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ఆయన బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వాలని వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. కూబా ఫోటోగ్రఫీ మిమ్ములను మెస్మరైజ్‌ చేస్తుంది” అన్నారు.

Also Read:అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -