‘పుష్ప 2’ పై కొత్త ముచ్చట్లు

28
- Advertisement -

అల్లు అర్జున్, సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతోన్న భారీ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప‌2. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న ఈ సినిమా గురించి క్రేజీ రూమ‌ర్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో వినిపిస్తోంది. పుష్ప‌2లో సంజ‌య్ ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారని, బ‌న్నీ- సంజ‌య్ మ‌ధ్య యాక్ష‌న్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయ‌ని టాక్ వినిపిస్తోంది. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు అని, సెకండ్ హాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ‘పుష్ప – 2’ వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల చేస్తామని ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది.

‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే పీటర్‌ హెయిన్స్‌ భారీ సెట్స్ కూడా వేశారు. వచ్చే షెడ్యూల్ లో పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ ను షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఊర్వశి రౌటేలా ఈ స్పెషల్ సాంగ్ చేయబోతుంది. మరి సమంత రేంజ్ లో ఆమె తన గ్లామర్ తో అలరిస్తోందో లేదో చూడాలి.

బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఊర్వశి రౌటేలాని కాకుండా ఓ స్టార్ హీరోయిన్ చేత పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుంది అంటూ చర్చ మొదలు పెట్టారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప‌2 చేస్తున్నఅల్లు అర్జున్, త‌న త‌ర్వాతి సినిమాల‌ను త్రివిక్ర‌మ్, సందీప్ రెడ్డితో ఇప్ప‌టికే అనౌన్స్ చేశాడు. కానీ, ఇప్పుడు బ‌న్నీ త‌న ప్రియారిటీని మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. పుష్ప‌2 త‌ర్వాత బ‌న్నీ, అట్లీతో సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడ‌ట‌. బ‌న్నీ కోసం అట్లీ ఓ సూప‌ర్బ్ స్టోరీని రెడీ చేశాడ‌ని, ఈ క‌థ‌పై బ‌న్నీ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

Also Read:తండేల్…అప్‌డేట్స్

- Advertisement -