పుష్ప 2..ఆ సీన్సే హైలైట్!

9
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఆగస్టు 15 ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఇంటర్వెల్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందట. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ వేటాడే సింహంలా సిక్స్ ప్యాక్ తో అదరగొడతాడని చెబుతన్నారు.

మొత్తంగా యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనున్నారు బన్నీ. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి సాంగ్ అందరిని ఆకట్టుకుంది.

Also Read:Sajjala:కౌంటింగ్‌ టైం..అప్రమత్తంగా ఉండండి

- Advertisement -