Pushpa 2: 12 రోజుల వసూళ్లివే

1
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ చిత్రం పుష్ప 2. విడుదలైన 12 రోజుల్లోనే రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దంగల్ (రూ.2070 కోట్లు), బాహుబలి 2 (రూ.1790 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

ఆర్ఆర్‌ఆర్, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది పుష్ప 2. 12వ రోజు ఈ సినిమా రూ.27.75 కోట్లు వసూలు చేయగా ఓవరాల్‌గా రూ.1500 కోట్లకు చేరువైంది. ఒక్క భారత్‌లోనే రూ.929.85 కోట్లకు చేరడం విశేషం.

ఇండియాలో గ్రాస్ వసూళ్ల విషయానికి వస్తే బాహుబలి 2 మూవీ రూ.1417 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. కేజీఎఫ్ 2 రూ.1000 కోట్ల గ్రాస్ తో రెండో స్థానంలో ఉంది. ఈ రికార్డులను కూడా పుష్ప 2 త్వరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. 12 రోజుల్లో పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.573.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. జవాన్ (రూ.582 కోట్లు), స్త్రీ 2 (రూ.598 కోట్లు) మాత్రమే పుష్ప 2 కంటే ముందున్నాయి. మొత్తంగా బన్నీ – సుకుమార్ పుష్ప 2 ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిందనే చెప్పాలి.

Also Read:TTD: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

- Advertisement -