‘పూర్వోత్తనాసనం’తో ఈ సమస్యలు దూరం!

68
- Advertisement -

నేటిరోజుల్లో వెన్ను నొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య. మామూలుగా అయితే వయసు మీరిన వారిలో ఈ వెన్నునొప్పి సమస్యను అధికంగా చూస్తుంటాం. కానీ ప్రస్తుతపు రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలమంది వెన్నునొప్పి లేదా నడుము నొప్పితో భాదపడుతూ ఉన్నారు. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చొని పని చేయడం. అలాగే శరీరానికి తగినంతా శ్రమ లేకపోయిన ఇలాంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ వెన్నునొప్పికి యోగాలో “పూర్వోత్తనాసనం ” ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల వెన్నెముకకు రక్తప్రసరణ మెరుగుపడి నడుమునొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా చేతులకు కాళ్ళకు పటుత్వాన్ని పెంచడంలో కూడా ఈ ఆసనం ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.

పూర్వోత్తనాసనం వేయు విధానం

ముందుగా నేలపై లేదా యోగా షీట్ పై వెల్లకిల పడుకొని రెండు కాళ్ళను ముందుకు చాచి, చేతులను శరీరానికి దగ్గరగా ఉంచుకోవాలి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతుల సహాయంతో నడుముభాగాన్ని పైకి లేపాలి. ఆతరువాత అరచేతులను రెండు భుజాల కిందకు పెట్టుకొని పాదాలు నెలకు సమాంతరంగా ఉంచుతూ కాలి వెళ్ళు భూమిని తాగేటట్టుగా శరీరాన్ని పైకి లేపాలి. తరువాత తలభాగాన్ని వెనుకకు వాల్చి శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి. ఇలా వీలైనంతసేపు ఈ భంగిమలో ఉండాలి.

గమనిక

అధిక రక్తపోటు, స్పాండిలైటీస్, మేడనొప్పి, వంటివి ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు. అలాగే కడుపుభాగంలో ఏదైనా సర్జరీ అయినవాళ్ళు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -