పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరో పాత్రను మాస్‌గా చూపిస్తాడు. తను తీసే సినిమాలో మాస్ కథాంశాలను ఎక్కువగా చూపిస్తాడు.అందుకే ప్రేక్షకులకు పూరీ సినిమా అంటే ఆసక్తి. మరి అలాంటి డైరెక్టర్ బాలయ్యతో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండబోతుంది…ఎలా ఉంటుంది అనే ఆలోచన అందరిలో నెలకొంది. కొంతమంది అసలు ఈ కాంబినేషన్‌లో సినిమా సాధ్యం కాదనే అనుకున్నారు. కానీ ఉహించని విధంగా తెరమీదకు వచ్చిన పూరి…బాలయ్యతో 101 చేసే అవకాశాన్ని కొట్టేశాడు.
పక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా ప్రారంభమైన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభం రోజునే రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల అటెన్షన్‌గా ఉంచిన పూరి… టైటిల్ విషయంలోనూ అదే పంథాను ఎంచుకున్నాడు. పైసా వసూల్‌గా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్‌లకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు.
ముఖ్యంగా భిన్న మనస్తత్వం గల ఈ ఇద్దరు షూటింగ్ సమయంలో ఒకరికొకరు బాగా నచ్చేశారట. దీంతో అనుకున్న సమయం కంటే నెల రోజుల ముందే సందడిచేసేందుకు ముందుకువస్తోంది. దీనికి తోడు ఫ్యాన్సీ రేటుకు సినిమా రైట్స్ అమ్ముడుపోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పైసా వసూల్ షూటింగ్ సమయంలో బాలయ్యకు పూరి మరో కథ చెప్పగా.. తప్పకుండా సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. బాలయ్యతో తొలి ప్రయత్నంలో గ్యాంగ్ స్టర్ సినిమా చేసిన పూరి.. ఈసారి పొలిటికల్ డ్రామా చేయబోతున్నాడట. ఆ సినిమా లైన్ వరకు చెప్పిన పూరి.. త్వరలోనే దాన్ని డెవలప్
చేసి బాలయ్యకు వినిపించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పైసా వసూల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తే వీరి కాంబోలో మరో సినిమా రావడానికి పెద్దగా టైం తీసుకోదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.