అమ్మాయిల్ని పట్టేయడంలో పూరి ఎక్స్‌పర్ట్ అనే చెప్పాలి. తన సినిమాలో ప్రతీదీ కొత్తగా..క్రియేటివ్ గా ఉండాలనుకునే పూరి..హీరోయిన్స్ విషయంలో కూడా అలాగే ఉంటాడు. పూరి సినిమా వస్తుందంటే చాలు..ఆ సినిమాలో కొత్త సరుకు దిగిపోవాల్సిందే. ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పూరి తన సినిమాలకోసం కొత్తభామల వేటలో ఉంటాడు కాబట్టి.
అదేంటోగానీ..పూరీకి అతి తక్కువ టైంలోనే నచ్చిన అమ్మాయిని పట్టేస్తాడు. అలా కొత్త టాలెంటును బరిలోకి దించడమే ఆయన పని. అయితే తనకు కావాల్సిన కొత్త సరుకు కోసం బార్డర్లు దాటి వెళ్లి మరీ వెతికి పట్టుకుంటుంటాడు.
ఇప్పుడు బాలయ్య 101వ సినిమాకి కూడా పూరి కొత్త పోరిని పట్టేశాడని తెలిసింది. ఈ సినిమాకోసం ముగ్గురు హీరోయిన్లని అనుకున్నారు. ముగ్గురూ కొత్తమ్మాయిలే అయితే బాగుంటుందని పూరీ అనుకున్నాడు. కానీ నిర్మాతలు అందుకు ఓకే చెప్పకపోవడంతో ఓ సీనియర్ నాయికను ఎంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికైతే పూరి ఓ కొత్త భామను ఫైనల్ చేసేశాడని టాక్. ఇక షూటింగులో భాగంగా బాలయ్య ఇంటర్వెల్ ఫైట్‌ని శరవేగంగా పూర్తి చేశాడు పూరి. అలాగే బాలయ్య చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ లో సన్నీలియోన్ మెరవనుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటించే ఆ సీనియర్ భామ ఎవరు? ఇందులోని మరో హీరోయిన్ ఎవరు? అన్నది కూడా త్వరలో తేలిపోనుంది. ఇక ఇప్పటికే ఎంపికైన కొత్తమ్మాయిని పూరి స్వయంగా ఇంట్రడ్యూస్ చేస్తాడేమో చూడాలి మరి.