కరోనా…ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచదేశాలు లాక్ డౌన్‌లో ఉన్నాయి. భారత్‌లో కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్‌లో ఉండగా ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్.
ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి…ఫ్రీడమ్ లేదు..బయటకు వెళ్లనీయడం లేదని ఏడుస్తున్నాం కానీ ప్రస్తుతం మనం బెటర్ పొజిషన్‌లో ఉన్నామని చెప్పారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ అయిపోతుంది అని అనుకోవద్దు.. మే 1కి వెళ్లొచ్చు. జూన్ 1కి వెళ్లొచ్చని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం చెప్పడం లేదు కానీ లాక్ డౌన్‌ని పొడిగిస్తారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదివారాలుగా లాక్ డౌన్‌లో ఉన్నాయి. మనకి పూర్తిగా క్యూర్ అయ్యే వరకూ వదిలిపెట్టరు దానికి ప్రిపేర్ అయ్యి ఉండండని చెప్పారు. లాక్ డౌన్ అంటే అదేదో దారుణం అని ఫీల్ అవ్వొద్దు. ప్రపంచంలో ఉన్న మిగతా కష్టాలను గుర్తు తెచ్చుకుంటే మనం చాలా బాగున్నాం. దయచేసి లాక్ డౌన్‌కి కోపరేట్ చేయాలన్నారు.