పూరి ‘రోగ్’ ఫస్ట్ లుక్‌

222
Puri Jagannadh's Rogue First Look
- Advertisement -

గత కొంతకాలంగా  సరైన హిట్  సినిమాలు లేని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆలోటును బర్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం తాను మొదలు పెట్టి ఆపేసిన రోగ్ సినిమాపై పూర్తి దృష్టిసారించాడు పూరి.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ ను పరిచయం చేస్తూ పూరి తెరకెక్కించిన చిత్రమే ‘రోగ్’. ‘ఇజం’ చిత్రం కన్నా ముందే ఈ సినిమాను మొదలు పెట్టినా వివిధ కారణాల వల్ల ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తోంది.

సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పూరి రిలీజ్ చేశారు. టైటిల్ కి క్యాప్షన్ గా మరో చంటిగాడి ప్రేమ కథ అని రాశారు. రివర్స్ లో.. అంటే కాళ్లను తాళ్లతో కట్టేసి ఇషాన్ ను వేళ్లాడదీసిన ఫోటో ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. తన ప్రేమను చెప్పే సమయంలో హీరో ఎంచుకునే రూట్ అనుకోవచ్చు. మరో చంటిగాడి ప్రేమ కథ అంటూ పూరీ తగిలించిన క్యాప్షన్ చూస్తుటే.. ఈడియట్ లో రవితేజ పాత్రకు అప్ డేటెడ్ అండ్ లేటెస్ట్ వెర్షన్ గా రోగ్ ని చెప్పుకోవచ్చు.

తన ప్రేమ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అనేట్లుగా ఉంటుందట హీరో పాత్ర. సహజంగా పూరీ హీరోలందరూ ఇలాగే ఉంటార్లే. అయితే.. రివర్స్ లో తన పనులు చక్కబెట్టుకుంటాడట. దాన్ని ఇండికేట్ చేసేందుకే ఇలా ఫస్ట్ లుక్ ఇచ్చాడని తెలుస్తోంది. తెలుగు.. కన్నడ భాషల్లో బైలింగ్యువల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

పూరి రోగ్‌ మూవీ ఫస్ట్ లుక్‌ పై వర్మ తనదైన శైలీలో కామెంట్ చేశాడు. ఇడియట్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రోగ్‌ లుక్‌ అమేజింగ్ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇడియట్ లాంటి వ్యక్తులనే మీరు ఎందుకు ఇష్టపడుతారని పూరిని తనదైన శైలీలో ప్రశ్నించాడు వర్మ. దీనికి సమాధానం ఇచ్చిన పూరి సైతం వర్మకు కౌంటరిచ్చే విధంగా మనమంతా అదే కోవకు చెందిన వారిమంటూ ట్విట్ చేయగా తాను మాత్రం ఇన్నోసెంట్ ఫ్యామిలీ పర్సన్‌ అంటూ వర్మ బదులిచ్చాడు.

ఇదిఇలా ఉండగా పూరీ తీసే యూత్ ఫుల్ మూవీస్ ప్రతీసారి ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇడియట్,పోకిరి,దేశముదురు, లోఫర్ ఇలా రకరకాల తిట్లను టైటిల్స్ చేసేశాడు పూరి. వీటిలో లోఫర్ మినహాయిస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే. మరి చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరి రోగ్‌తో ఆలోటును భర్తి చేస్తాడా లేదా చూడాలి.

- Advertisement -