డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిన ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను సైతం కంప్లీట్ చేసుకుని యు\ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
ఎవరో కొత్త దర్శకుడు సినిమా తీసినట్లుగా మెహబూబా ఉంటుందని పూరి తెలిపారు. పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అన్నారు. టేకింగ్ పరంగా చూస్తే .. ఎక్కడా నా శైలి కనిపించదని…ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకి .. ఈ సినిమాకి మధ్య ఎలాంటి పోలిక ఉండదన్నారు. ఈ సినిమా హీరోగా ఆకాశ్ కి మంచి పేరు తెచ్చిపెడుతుందన్నారు.
ఈ సినిమా తర్వాత తాను తీయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మహేష్ బాబుతో జనగణమన ప్రాజెక్టును ప్రకటించిన పూరి ఏడాది దాటిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మహేశ్ రెడీగా లేకున్నా తాను జనగణమన సినిమాను తప్పక తీస్తానని చెప్పాడు . మహిళలపై జరుగుతున్న వేధింపుల ఘటనలు, ఇతర సమస్యలే జనగణమన స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు తనలో స్ఫూర్తిని కలిగించాయని పూరీ చెప్పాడు. మహేష్ కాదంటే ఈ సినిమాలో హీరోగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటాడోననే ఆసక్తి అందరిలో నెలకొంది.