పూరి జగన్నాథ్ పై కొత్త రూమర్

30
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో చకచకా సినిమాలు తీయడంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్ తోపు. కాకపోతే, ఈ మధ్య పూరి జగన్నాధ్ ట్రాక్ ఏమీ బాగాలేదు. లైగర్ సినిమా దెబ్బకు పూరి జగన్నాథ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ప్రస్తుతానికి పూరి జగన్నాధ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాధ్ పై ఇప్పుడు ఓ రూమర్ వినిపిస్తోంది. ఇంతకీ, ఏమిటి ఆ రూమర్ ?, పూరి జగన్నాధ్ ఇల్లు ఒకటి డైలమాలో పడిందట. తన కొత్త సినిమా నిర్మాణం కోసం డబ్బుల్లేక ఆఖరి నిమిషంలో ఆ ఇంటిని అమ్మేస్తున్నాడని టాక్. అదేమిటి ? పూరి జగన్నాధ్ దగ్గర డబ్బులు లేకపోవడం ? అని అతని గురించి తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు.

కారణం.. ఆ ఇల్లు అమ్మాల్సిన అవసరం పూరి జగన్నాధ్ కి ఏ మాత్రం లేదు. తన పిల్లల కోసం పూరి జగన్నాధ్ ఆ ఇల్లు కొన్నాడు. అయితే, ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. పైగా కొంతమంది ఆ ఇంటి పై కన్ను వేశారు. దీంతో, పూరి జగన్నాధ్ కి ఆ ఇంటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం కష్టంగా మారింది. అందుకే, తనకు డబ్బు అర్జెంట్ అంటూ ఆ ఇంటిని బేరానికి పెట్టాడు. బేరం కుదిరింది, ఓ నిర్మాత ఆ ఇంటిని కొనడానికి ముందుకు వచ్చాడు. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ నిర్మాత చేతులెత్తేశాడు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని, కాబట్టి ఇప్పుడు ఇల్లును కోనలేనని పూరి జగన్నాధ్ కి చెప్పేశాడు.

నిర్మాత హ్యాండ్సప్ అనడంతో పూరి జగన్నాధ్ ఆ ఇంటిని ఎలా అమ్మాలా ? అంటూ ప్లాన్స్ వేసే పనిలో పడ్డాడు. మరోపక్క ఈ ఇల్లు తనది అని మరొకరు వాదిస్తున్నారు. పైగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నారు. మరి ఇప్పుడు పూరి జగన్నాధ్ ఏమి చేస్తాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే, ఇంటిని సాఫీగా అమ్మడానికి, కస్టమర్ల కోసం అన్వేషిస్తున్నాడు. ఇందులో భాగంగా పూరి జగన్నాధ్ కు తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేస్తున్నాడట.

Also Read:TTD:సంతృప్తిక‌రంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

- Advertisement -