పాన్ ఇండియా మూవీగా జనగణమన

251
puri jagannadh
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్న పూరి…తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు జనగణమనకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. త్వరలో జనగణమన మూవీ పట్టాలెక్కనుందనిజ…పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీంతో మరోసారి పూరి జనగణమన మూవీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి మహేశ్‌తో జనగణమన చేసేందుకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు పూరి. ప్రత్యేకంగా మహేశ్ కోసమే కథ రాశానని సైతం వెల్లడించారు.

అయితే జనగణమన అనౌన్స్ సమయంలో దర్శకుడిగా పూరి కెరీర్‌ సంక్షోభంలో ఉండటంతో డేట్స్ ఇచ్చేందుకు నిరాకరించారు మహేశ్. దీంతో మహేశ్ డేట్స్ కోసం వేచి చూసిన పూరి…చివరకు తన మనసులోని మాటను బయటపెట్టేశారు.

మహేశ్ రెడీగా లేకున్నా తాను జనగణమన సినిమాను తప్పక తీస్తానని చెప్పాడు . అన్నట్టుగానే మహేశ్‌ లేకుండానే జనగణమన తీసేందుకు పూరి సిద్ధమైనట్లు సమాచారం. మరి ఈ పాన్ ఇండియా మూవీలో హీరోగా ఎవరిని ఎంపికచేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -