యాక్షన్ సీక్వెన్స్‌ తో ‘డబుల్ ఇస్మార్ట్’

46
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లో తన పాత్ర కోసం రామ్ మేకోవర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ట్రాన్స్ ఫర్మేషన్ చూపించే వీడియోలో సూపర్ స్మార్ట్ గా కనిపించారు రామ్. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్ పై పూరీ జగన్నాధ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. భారీ సెట్‌ లో రామ్, ఫైటర్స్‌పై భారీ సీక్వెన్స్‌ తో టీమ్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం నుంచి పూరీ జగన్నాధ్ తో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కేచ ఈ సీక్వెన్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు.

వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో ఫైర్ వర్క్స్ పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించారు. పూరి, కేచ, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు.Also Read:

Also Read: #ShivannaSCFC01 అనౌన్స్ మెంట్

డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.

Also Read:‘ఘోస్ట్’… ‘బిగ్ డాడీ’ టీజర్

- Advertisement -