సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య వందో సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన శాతకర్ణి రికార్డు వసూళ్లను రాట్టింది. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను శాతకర్ణి విజయవిహారం చేసింది. గౌతమిపుత్రతో సంచలనం సృష్టించిన బాలయ్య తన 101వ సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నారు.
గత కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేని టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆలోటును బర్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టార్ హీరోలంతా పూరి సినిమాలంటే ఆమడ దూరం పరుగెడుతున్న నేపథ్యంలో బాలయ్య మాత్రం ఆయనకే జై కొట్టాడు. పూరి చెప్పిన కథ బాలయ్యకు తెగనచ్చిందట. దీంతో కృష్ణవంశీతో పాటు కెఎస్ రవికుమార్ సినిమాలను కూడా పక్కనబెట్టి ఈ సినిమాపై దృష్టిసారించాడు.
భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ముహూర్తం కూడా ఇటీవలే జరిగింది. కాగా, ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నూతన కథానాయికలను పరిచయం చేస్తున్నారు. అలాగే కీలక పాత్రలకు మరికొందరు నూతన నటీనటులను కూడా తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పూరీ జగన్నాథ్ సంస్థ ‘కేస్టింగ్ కాల్’ ప్రకటన ఇచ్చింది.
ఇందులో 23-30 ఏళ్ల వయసున్న ఇద్దరు కథానాయికలు కావాలని, 45-50 ఏళ్ల ప్రధాన విలన్ పాత్రధారి కావాలని .. ఇలా మొత్తం పన్నెండు ముఖ్య పాత్రలకు తారలు కావాలంటూ పూరీ జగన్నాథ్ ప్రకటన ఇచ్చాడు. సాధారణంగా బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాకు స్టార్ రేంజిలో వుండే నటులనే తీసుకుంటారు. అలాంటిది ఇలా కేస్టింగ్ కాల్ ద్వారా ఆర్టిస్టులను ఎంపిక చేస్తూ పూరీ సంచలనం రేపాడు. మరి బాలయ్యతో తీసే సినిమాతోనైనా పూరి హిట్ ట్రాక్‌లో పడతాడో లేదా చూడాలి.