రామ్‌గోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. తాను తీసిన సినిమాలతో కంటే..వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాంట్రవర్శికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. వర్మ ఏది చేసినా అది సంచలనమే. అయితే రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. అయితే వర్మ తాజాగా తన శిష్య బృందంతో వీకెండ్ పార్టీ జరుపుకున్నాడు.దీంటో విశేషం ఎంటంటే.
వర్మ తనతో పాటు తన శిష్య బృందాన్ని సంగీతంలో ఓలలాడించిన ఓ కళాకారుడికి దర్శకుడు రాంగోపాల్ వర్మ పాదాభివందనం చేశారు. మరో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మిలతో కలిసి వీకెండ్ పార్టీని ఎంజాయ్ చేసిన రాంగోపాల్ వర్మ, గిటార్ ప్లే చేస్తున్న కళాకారుడి స్వర విన్యాసానికి ముగ్ధుడయ్యాడు. “సార్… ఐ వాంట్ టు టచ్ యువర్ ఫీట్” అని వర్మ కితాబిచ్చాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న పూరీ జగన్నాథ్, ఇతనో త్యాగరాజు అని తనవంతు కితాబిచ్చాడు.
సదరు కళాకారుడు ఆపై ‘టైటానిక్’ చిత్రంలోని గీతాన్ని ఆలపిస్తుంటే, వర్మ లేచి వెళ్లి పూరి కొడుకుతో మాట్లాడుతుంటడగా, వారికి వంటకాలను తయారు చేస్తున్న షెఫ్ లు కనిపించారు. ఈ వీడియోలో వర్మ టీమ్ లోని దాదాపు 15 మంది పాల్గొనగా, చార్మి స్వయంగా వీడియో తీసి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
https://youtu.be/wTMqMSIG06Q