రంగురంగుల చిత్రసీమ వెనుక ఉండే చీకటికోణం మరోసారి బయటపడింది. తెర మీద అభిమానుల నీరాజనాలు అందుకునే హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు.. నిజజీవితాల్లో మాత్రం విలన్లుగా మారిపోయారు. తాము అభిమానించే నటులు మత్తు బానిసలా అని తెలుసుకుంటున్న ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్‌చేస్తున్న డ్రగ్స్ అంశం ప్రముఖుల పేర్లు బయటికి రావడం సంచలనంగా మారింది.
తాజాగా వెల్లడయిన వివరాల ప్రకారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి నోటీసులు అందుకున్న వారంతా పూరీ జగన్నాథ్ బ్యాచ్ కావడం విశేషం. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1985లోని సెక్షన్ 67 ప్రకారం 14 మందికి నోటీసులు పంపిన వారిలో 12 మంది పేర్లు బయటికొచ్చాయి. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించబోతున్నారు. వీరంతా కెల్విన్ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు.
పోలీసుల విచారణలో భాగంగా కెల్విన్ బయటపెట్టిన వాస్తవాలతో అధికారులు విస్తుపోయారు. కెల్విన్ ముఠా ఫోన్ వివరాలు, సంభాషణలతో పాటు వివిధ సందర్భాల్లో వీరు కలిసిన వీడియో దృశ్యాలు కూడా సేకరించారు.
నోటీసులు అందుకున్నది వీళ్లే
హీరోలు: రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు
హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్,
డైరెక్టర్ పూరీ జగన్నాథ్,
కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు,
ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
శ్రీనివాసరావు(రవితేజ డ్రైవర్)