ధావన్ సెంచరీ వృధా…పంజాబ్ గెలుపు

299
pooran
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్…. 19 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది.

క్యాపిటల్స్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ స్వల్ప స్కోరుకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ (15), క్రిస్‌గేల్‌(29), మయాంక్‌ అగర్వాల్‌(5) వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పురాన్‌,మ్యాక్స్‌వెల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పురాన్ 28 బంతుల్లో 3 సిక్స్‌లు,6 ఫోర్లతో 53,మ్యాక్స వెల్ 32 పరుగులు చేసి ఔటయ్యారు.దీపక్ హుడా 15,నిషమ్ 10 పరుగులు చేశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ ‌(106నాటౌట్‌: 61 బంతుల్లో 12ఫోర్లు, 3సిక్సర్లు) రాణించగా ,శ్రేయస్‌ అయ్యర్‌(14), రిషబ్‌ పంత్‌(14) పర్వాలేదనిపించారు. దీంతో డీసీ నిర్ణీత ఓవర్లలో గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ రెండు వికెట్లు తీయగా మాక్స్‌వెల్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలో వికెట్‌ తీశారు.

- Advertisement -