అది చెత్త పిచ్‌

218
Pune pitch as 'poor'
- Advertisement -

పుణెలోని ఎంసీఏ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. భారత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు తీవ్రనిరాశ చెందిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడంపై పిచ్‌పై కూడా అనుమానాలు తలెత్తాయి. దీంతో పిచ్‌ పరిస్ధితిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ బీసీసీఐకి నివేదిక సమర్పించారు. పుణె పిచ్‌ పేలవంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నాడు.

అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఇలాంటి వికెట్లు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నాడు. దీనిపై బీసీసీఐ 14 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బీసీసీఐ ఇచ్చే వివరణ తర్వాత ఐసీసీ ఈ పిచ్‌ విషయంలో హెచ్చరించడమో.. లేదా ఇంకేదైనా నిర్ణయం తీసుకోవడమో చేస్తుంది. భారత్‌లో పిచ్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవడం.. ఐసీసీ హెచ్చరికలు జారీ చేయడం ఇది తొలిసారి కాదు. రెండేళ్ల కిందట భారత్‌-దక్షిణాఫ్రికా టెస్టు ఆతిథ్యమిచ్చిన నాగ్‌పుర్‌ పిచ్‌ కూడా చెత్తగా ఉందని రిఫరీ నివేదిక ఇచ్చాడు. ఆ మ్యాచ్‌ కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. కానీ అప్పుడు ఫలితం భారత్‌కు అనుకూలంగా రాగా.. ఈసారి భారత్‌ చిత్తుగా ఓడింది.

ఇక పుణెలో భారత ప్రదర్శనపై కొంత అసంతృప్తికి గురిచేసిన సిరీస్ టీమిండియాదేనని భారత మాజీ కెప్టెన్ గంగూలీ స్పష్టం చేశాడు. తొలిటెస్టులో భారత్ అద్భుతంగా ఆడిందని అయితే ఎల్లప్పుడు ఒకే జట్టు విజయాలు సాధించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. సొంతగడ్డపై ఓడిపోవడం సహజమేనని… ఎన్నో జట్లు అలా ఓడాయి….ఇదే తొలిసారి కాదని దీని గురించి మర్చిపోవాలని టీమిండియాకు ధైర్యం చెప్పారు. కరుణ్‌ నాయర్‌కు అవకాశం ఇవ్వాలని … అజింక్య రహానె ఆత్మవిశ్వాసలేమితో కనిపిస్తున్నాడని తెలిపాడు.

- Advertisement -