రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో..

281
pulse-polio

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం (19 జనవరి 2020) ప్రారంభమైంది. తల్లిదండ్రులు ఐదేళ్లలోపు తమ చిన్నారులందరికీ పల్స్‌పోలియో చుక్కలు వేయిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా 38,36,505 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. 23,331 కేంద్రాల్లో, అన్ని హాస్పిటల్స్, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కల వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు. ఇందుకోసం జిల్లాలకు 50,64,500 వాక్సిన్‌ డోస్‌లు పంపారు.