టెస్టుల్లో వారి కథ ముగిసినట్లేనా ?

44
- Advertisement -

టెస్ట్ క్రికెట్ అనగానే కొందరి పేర్లు టక్కున గుర్తొస్తాయి. అప్పట్లో రాహుల్ ద్రావిడ్ ను ది వాల్ గా టెస్ట్ క్రికెట్ లో పిలుచుకునే వారు. ఇప్పుడున్న జట్టులో ఆ స్థాయిలో రాణించే ఆటగాడిగా టెస్ట్ స్పెషలిస్ట్ గా చటేశ్వర్ పూజారా పేరు తెచ్చుకున్నాడు. ఓవరాల్ గా టెస్టుల్లో 103 మ్యాచ్ లు ఆడిన పూజారా 44.4 స్ట్రైక్ రేట్, 43.6 సగటు తో 7195 పరుగులు చేశాడు. ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన రికార్డులు పూజారా సొంతం. మరి ఈ స్థాయి ఆటగాడికి గత కొన్నాళ్లుగా టీమిండియాలో చోటు దక్కడం లేదు. యువ ఆటగాళ్ల ఎంట్రీతో పూజారా చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రంజీల్లో సత్తా చాటుతున్నప్పటికి టీమిండియా సెలక్టర్లు మాత్రం పూజారా విషయంలో పెదవి విరుస్తున్నారు. .

పూజారాతో పాటు మోస్ట్ కన్సిస్టింగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న రహనే సైతం టెస్ట్ లకు దూరమయ్యాడు. రహనే కూడా టెస్టుల్లోనూ వన్డేల్లోనూ జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఎన్నో అందించాడు. ప్రస్తుతం జట్టులో చోటు కోల్పోయి రంజీల్లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు మళ్ళీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్  తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా కీలక ఆటగాళ్ళైన విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్, జడేజా.. వంటి వారు దూరం కావడంతో పూజారా, రహనే లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్న సెలక్టర్లు రహనే, పూజారా లకు చోటు కల్పించడం కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది. దీని బట్టి చూస్తే వారిద్దరి కెరియర్ ముగిసిపోయినట్లేనని చెబుతున్నారు కొందరు క్రీడా విశ్లేషకులు.

- Advertisement -