రకుల్‌కి పోటిగా బాలీవుడ్‌ బ్యూటీ..

192
- Advertisement -

తెలుగు తెరపై ఎప్పటికప్పుడు కొత్త తారలు తళుక్కుమంటారు. ఒకరిని మించి మరోకరు అందాలను ఆరబోస్తుంటారు. అలా చాల తక్కువ సమయంలో తన అందాలతో అభినయంతో ఆకట్టుకుంది హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.టాలీవుడ్ లో ఎప్పుడు ఏ కథానాయికకి పట్టం కడుతుందో .. అలాంటి కథానాయికకు మరే కథానాయిక వలన గట్టి పోటీ ఏర్పడుతుందో చెప్పలేం. ఒకరు వెలుగులోకి రావడం మరొకరి ప్రాభవం తగ్గడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదే. కొత్తగా వచ్చిన కథానాయికలు అంతకంటే ముందుగా వచ్చిన కథానాయికలకు పోటీ ఇవ్వడం సహజంగా జరుగుతున్నదే. ఇప్పుడు అదే తరహాలో పూజా హేగ్దే రకుల్ ప్రీత్ సింగ్ మద్య పోటీ నడుస్తున్నట్టు  అనిపిస్తుంది.

Puja to compete with Rakul

ఇప్పుడు పూజా హెగ్డే ద్వారా రకుల్ కి పోటీ ఎదురయ్యే అవకాశం వుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తెలుగు తెరకి ఓ చిన్న సినిమాతో పరిచయమైన రకుల్, అగ్రకథానాయకుల సరసన వరుసగా ఛాన్సులు సంపాదించుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అలా ఆమె హవా కొనసాగుతుండగా..ముకుంద్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది పూజా. తరువాత ఒకలైలా కోసం సినిమాతో నాగచైతన్యతో జత కట్టింది. ఆ సినిమాలు హిట్‌ కాకపోవడంతో అనుకునంత అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. అయితే బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌తో మొహాంజోదారోలో నటించింది. ఆ సినిమా కూడా బోల్తాకొట్టడంతో టాలీవుడ్‌లో మళ్లీ కొంత గ్యాప్ తో ‘దువ్వాడ’తో పూజా హెగ్డే తిరిగొచ్చింది. ఈ సినిమా హిట్ కొట్టడంతో దర్శక నిర్మాతల దృష్టి ఇప్పుడు పూజా హెగ్డేపై పడిందట. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె రకుల్ కి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -