రెండోసారి కూడా రొమాన్స్‌కు రెడీ…

613
puja hegde romance with chaitu again
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్లో పూజా హెగ్డే పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ భామ గురించే గుసగుసలు. తెలుగులో తొలి సినిమా ‘ఒక లైలో కోసం’లో.. మరో సినిమా ‘ముకుంద’లో ఈ అమ్మడు ఎంత పద్ధతిగా కనిపించిందో తెలిసిందే.

కానీ ఈ సినిమాలతో వచ్చిన ‘క్యూట్’ ఇమేజ్ ను కొనసాగించడానికి పూజా ఇష్టపడలేదు. తన లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’లో పూజా ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేసింది.

Allu Arjun DJ Movie Malayalam Version Release Date

ఇదిలా ఉంటే..గ్లామర్ పరంగా పూజా హెగ్డేకి ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూత్ లో ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు తమ తదుపరి సినిమాల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. అలా తనకి వచ్చిన అవకాశాల్లో ముందుగా ఆమె మైత్రీ మూవీ మేకర్స్ వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

puja hegde romance with chaitu again

మైత్రీ మూవీ మేకర్స్ వారు .. చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి ఒక సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పూజా, చైతూతో తెరకెక్కించే ఈ సినిమా వీరి కాంబినేషన్‌ లో వస్తున్న సెకండ్‌ మూవీ. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ‘ఒక లైలా కోసం’ లో హంగామా చేశారు. ఫస్టు మూవీ ఓ మాదిరిగా ఆడేసినా…. ఇక సెకండ్ మూవీతో బంపర్‌ హిట్ కొడతారేమో చూడాలి మరి.

- Advertisement -