ప్రధానిని చంపితే రూ.5 కోట్లు.. వ్యక్తి అరెస్ట్

60
modi

ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపితే రూ. 5 కోట్లు ఇస్తానన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పుదుచ్చేరి పోలీసులు. పుదుచ్చేరికి చెందిన సత్యానందం(43) అనే రియల్టర్ తన ఫేస్ బుక్ ద్వారా ప్రధానిని చంపితే రూ. 5 కోట్లు ఇస్తానని ప్రకటన ఇచ్చాడు.

ఈ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫేస్ బుక్ ఎకౌంట్ ఆధారంగా సత్యానందాన్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 505(1), 505(2) కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.