నా ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దు..

42
actor Chandra Mohan

టాలీవుడ్‌లో అద్భుతమైన నటుల్లో ఒకరిగా చంద్రమోహన్ పేరుగాంచారు. ఆయన గత ఆదివారంతో 80 వసంతాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్యం బాగోలేదని అస్వస్థతకు గురయ్యారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. కొంతమంది ఔత్సాహికులు ఆయన మరణించారని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రమోహన్‌ ఓ వీడియో ద్వారా స్పందించారు.

తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, ఆరోగ్యంగా ఉన్నానని ఆయన తెలిపారు. పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ఆశీస్సులే శ్రీరామ రక్ష అని చంద్రమోహన్‌ పేర్కొన్నారు.