- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయగా తాజాగా యుఎస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ కేసుల నిరోధానికి వ్యాక్సిన్ల పంపిణీ, చికిత్సును వేగవంతం చేయనున్నారు.
ఇప్పటివరకు అమెరికాలో సుమారు 6600 కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో మూడవ వంతు కేసులు న్యూయార్క్‌లో బయటపడ్డాయి. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 26వేల కేసులు నమోదు అయినట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది.
- Advertisement -