అఫ్గానిస్థాన్‌లో ఒక హంతకుడికి బహిరంగంగా శిక్ష అమలు చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కోస్ట్ స్టేడియంలో వేలాది మంది పర్యవేక్షణలో, తన తండ్రిని హత్య చేసిన నేరస్థుడిని 13 ఏళ్ల బాలుడి చేత కాల్చించి శిక్షించారు. మొత్తం ఘటనలో దాదాపు 80 వేల మంది హాజరై ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
నిందితుడు మంగళ్ అనే వ్యక్తి 13 మందిని క్రూరంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు. అతను అబ్దుల్ అనే వ్యక్తిని కూడా హత్య చేసినందుకు, ఆఫ్ఘాన్ సుప్రీం కోర్ట్ ప్రత్యేక ఆదేశాల మేరకు బహిరంగ శిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. శిక్ష అమలు చేయడానికి ముందు నిందితుడికి క్షమాభిక్ష ఇవ్వాలా అని బాధితుడి కుమారుడిని అడిగారు. అయితే, 13 ఏళ్ల బాలుడు తన తండ్రి హత్యను క్షమించబోనని, చట్టం చెప్పిన విధంగానే శిక్ష అమలవ్వాలని స్పష్టంగా చెప్పాడు.
ఆ తరువాత పోలీసులు తుపాకీని బాలుడికి అందించి, చట్టపరంగా అనుమతించిన ప్రోటోకాల్ ప్రకారం మంగళ్‌ను కాల్చి చంపించారు. ఈ శిక్ష అమలు తర్వాత స్టేడియంలో ఉన్న ప్రజలు కూడా ఘటనా స్థలాన్ని విడిచి వెళ్లే వరకూ కఠిన భద్రతా ఏర్పాట్లు కొనసాగించాయి. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఇలాంటి బహిరంగ శిక్షలు పెరుగుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:TTD:ఘనంగా చక్రతీర్థ ముక్కోటి

