తెలంగాణ మోడల్‌ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు కూడా చేసింది. అయితే దీనిపై ఈసీ ఇంకా స్పందించలేదు.
అయితే తాజాగా పార్టీ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన జారీ చేసింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ పేరుతో జారీ అయిన ఈ ప్రకటనలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరు మారుస్తున్నామని దీనిపై ఎవరికైన అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని తెలిపారు.
ఇక ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పార్టీ మార్పుకు సంబంధించిన పత్రాలతో పాటు కారు గుర్తునే కేటాయించాలని కోరారు. త్వరలోనే దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోనుఏంది. వాస్తవానికి ఏదైన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ పేరు మార్పు, సవరణలపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి…ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రకటన జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..