టీజర్‌తో అదరగొడుతున్న’గరుడ వేగ’..

354
PSV Garuda Vega Teaser Talk
- Advertisement -

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం`.

PSV Garuda Vega Teaser Talk

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా మంచి మార్కులు కొట్టేసిన రాజశేఖర్, ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. వరుస పరాజయాలు ఎదురుకావడమే అందుకు కారణం. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఎక్కువగా ఆడియన్స్ ను ఆకట్టుకున్న రాజశేఖర్, అదే తరహా పాత్రను ఇప్పుడు గరుడ వేగ’లో పోషించారు. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

PSV Garuda Vega Teaser Talk

ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఛేజింగులు, ఫైరింగులతో, చివరిలో కాస్తంత కామెడీ టచ్‌తో ఈ టీజర్ ను ఆసక్తికరంగానే కట్ చేశారు. తన స్టైల్ కి తగిన సినిమా కావడంతో దీనిపై రాజశేఖర్ భారీ ఆశలే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పూజాకుమార్, శ్రద్ధా ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.

- Advertisement -