మ్యూజికల్ సర్‌ ప్రైజ్ ఇచ్చిన పవన్…

206
PSPK25 Musical Surprise

పవర్ స్టార్ పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పవన్ బర్త్ డే సందర్భంగా  నిన్న ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మ్యూజికల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఈ వీడియోలో అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ‘బైటకొచ్చి చూస్తే.. టైమేమో త్రీవో క్లాక్..’ అనే పాట‌ పాడి అలరించాడు. ఈ సినిమాకు ఇతడే సంగీతం సమకూరుస్తున్నాడు. అనిరుధ్ పాడుతుండగా.. పక్కనే ఉన్న త్రివిక్ర‌మ్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక వీడియో చివ‌ర్లో డార్క్ షేడ్‌లో ప‌వన్‌ను చూపించి అదరహో అనిపించారు. పవన్ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ కిక్కివ్వడం ఖాయం. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో పవన్‌.. ఓ ఐటీ నిపుణుడి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా 2018 జ‌న‌వ‌రి 10 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Agnyaathavaasi Musical Surprise - Pawan Kalyan | Trivikram Srinivas | Anirudh Ravichander | #PSPK25