- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ ను పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్ ఖారారు చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్లర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
ఈ చిత్రం టైటిల్ ను ‘వకీల్ సాబ్’గా నిర్ణయిస్తూ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో కుర్చీపై కాళ్లు ఆనించి ఉండటం ఫస్ట్ లుక్ లో కనబడుతుంది. కాగా, పవన్ కల్యాణ్ నటించిన 26వ చిత్రమిది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
- Advertisement -