శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను చక్కగా కల్పిస్తోందని బ్రిజ్‌లాల్ అధ్యక్షతన గల భారత హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభినందించింది.
ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుండి చేపడుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ కార్యకలాపాలను 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం కమిటీ ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీవారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులను, తిరుమల పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలను ప్రశంసించారు.
కమిటీ సభ్యులు శ్రీ బిప్లవ్ కుమార్ దేవ్, శ్రీ నీరజ్ శేఖర్, శ్రీ దిలీప్ ఘోష్, శ్రీ దులాల్ చంద్ర గోస్వామి, శ్రీ రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధికారులతో పాటు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ శ్రీ శుభం బన్సల్, ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్, టీటీడీ, జిల్లా, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read:పుచ్చకాయ గింజలతో ఉపయోగాలు..