రేవంత్‌ డౌన్ డౌన్..హోరెత్తిన కొడంగల్

3
- Advertisement -

రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తింది కొడంగల్. రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ నేతలు, రైతులు.

Also Read:గ్రూప్‌ 1 పరీక్షపై ప్రభుత్వ ప్రకటన

- Advertisement -