కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు..

133
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సవరణ 2021 చట్టంకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో ఆల్ ఇండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్స్ జాతీయ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి కో ఆర్డినెషన్ కమిటీ సభ్యుడు రత్నాకర్ రావు పాల్గొన్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న దేశవ్యాప్త సమ్మె చేస్తామని ఆయన తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

డిసెంబర్ 8న ప్రధాన మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో పాటు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు వినతిపత్రాల అందజేయనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ డిసెంబర్ 15న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ, నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ చట్టసవరణ బిల్లుకు నిరసనగా డిసెంబర్ 15న ర్యాలీలో పాల్గొనాలని అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన సమయంలో అన్ని పవర్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు.

- Advertisement -