ప్రోటీన్ లోపాన్ని గుర్తించండిలా!

35
- Advertisement -

మన శరీర పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ అనేది కండరాలను బలపరచడంలోనూ, ఎముకలను దృఢంగా మార్చడంలోనూ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే నేటి రోజుల్లో చాలామంది ప్రోటీన్ లోపంతో బాధ పడుతున్నారు. దానికి ప్రధాన కారణం పోషకాలు లేని ఆహారాన్ని తినడమే. సరైన పోషకాలు అందకపోవడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే చాలామంది తమలోని ప్రోటీన్ లోపాన్ని గుర్తించలేక ఏదేదో మెడిసిన్ తీసుకుంటూ లేని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందువల్ల ప్రోటీన్ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. .

సాధారణంగా ప్రోటీన్ లోపం ఉన్నవారిలో కనిపించే ప్రధాన సమస్య బలహీన పడడం. సాధారణ బరువు కంటే వేగంగా బరువు తగ్గుతుంటే ప్రోటీన్ లోపంగా భావించాలి. ఇంకా కండరాల నొప్పులు, ఎముకలు బలహీనంగా మారిపోవడం, జుట్టు రాలిపోవడం, చిన్న పని చేసిన అలసట రావడం, నీరసంగా ఉండటం, సరైన నిద్ర రాకపోవడం.. ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం కారణంగానే వస్తుంటాయి. కాబట్టి ప్రోటీన్ లోపాన్ని అదిగమించేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ లోపాన్ని అధిగమించేందుకు మెడిసిన్ కంటే తినే ఆహారం విషయంలోనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్, గుడ్లు, పాలు, వేరుశనగ.. వంటి వాటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని డైలీ ఆహార డైట్ లో చేర్చుకోవాలి. ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ పాలు, గుడ్డు ప్రతిరోజూ తీసుకోవాలి. వారానికి రెండు లేదా మూడు సార్లు చికెన్, చేపలు.. వంటి మాంసహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తినాలి.. వీటితో పాటు శారీరక శ్రమ కూడా ఉండాలి. అప్పుడే ప్రోటీన్ లోపాన్ని త్వరగా అధిగమించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:సాయిచంద్ వ‌ర్ధంతి..కేటీఆర్ ఘన నివాళి

- Advertisement -