కాళేశ్వరం లింక్-1 లోని మూడు బ్యారేజీల బ్యాక్ వాటర్స్ నుండి మూడు లిఫ్టుల ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని “1,31,840” ఎకరాలకు సాగునీరు .
మొదటి లిఫ్ట్: మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ (ప్రాణహిత నది) “25,100” ఎకరాలకు లబ్ది.
వెంచపల్లి గ్రామం (30 మీటర్లు), వేమనపల్లి మండలం దగ్గర ప్రాణహిత నది (మేడిగడ్డ బ్యాక్ వాటర్స్) మీద ఒక లిఫ్ట్ నిర్మించనున్నారు. ఈ లిఫ్ట్ సహాయంతో వేమనపల్లి, కోట్పల్లి (20 మీటర్లు) మండలాల్లో 23,770 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందనుంది. 1330 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా 25,100 ఎకరాలకు లబ్ది చేకూరనుంది.
రెండో లిఫ్ట్: అన్నారం బ్యారేజీ ఫోర్ షోర్.(50 మీటర్ల లిఫ్ట్) “61,743” ఎకరాలకు లబ్ది.
అన్నారం బ్యారేజీ ఫోర్ షోర్ నుండి 50 మీటర్లు నీరు లిఫ్ట్ చేసి చెన్నూరు, కోటపల్లి మండలాల్లో 31252 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిస్తూ, 30,491 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు.
మూడో లిఫ్ట్: సుందిళ్ళ బ్యారేజీ ఫోర్ షోర్. (83 మీటర్ల లిఫ్ట్). “51,297” ఎకరాలకు లబ్ది.
సుందిళ్ళ బ్యారేజి ఫోర్ షోర్ నుండి 83 మీటర్లు నీరు లిఫ్ట్ చేసి భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో 29,418 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించడంతో పాటుగా 21,879 ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు.