Year Ender 2024: ఈ సంవత్సరం మరణించిన నేతలు వీరే

7
- Advertisement -

2024 ప్రపంచంలో ఎన్ని సంఘటనలు,మరచిపోలేని విషయాలు, గొప్ప నాయకులు మరణించారు. ఇలా ప్రపంచంలో మరణించిన వివిధ ప్రముఖుల విషయాలను గమనిస్తే. 2024లో మరణించిన అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరు ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. అలాగే రష్యా ప్రతిపక్ష నాయకుడు , వ్లాదిమిర్ పుతిన్ ను నిత్యం విమర్శించే నాయకుల్లో ఒకరైన అలెక్సీ నవల్నీ ఫిబ్రవరి 2024లో కన్నుమూశారు. నవల్నీ మరణాన్ని ఫిబ్రవరి 16న రష్యా ప్రకటించింది. అయితే నవాల్నీ మరణం వెనుక కారణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది.

ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ…మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రైసీ ఆగష్టు 2021 నుండి ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నారు . 1997 నుండి 2007 వరకు యునైటెడ్ కింగ్‌డమ్ ఉప ప్రధాన మంత్రిగా పనిచేసిన జాన్ ప్రెస్‌కాట్ నవంబర్ 20, 2024న మరణించారు.

2010 నుండి 2014 వరకు మరియు 2018 నుండి 2022 వరకు చిలీకి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సెబాస్టియన్ పినెరా 6 ఫిబ్రవరి 2024న మరణించారు. 76 ఏళ్ల బిలియనీర్ వ్యాపారవేత్త దక్షిణ చిలీలో విహారయాత్రలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.1990 నుండి 2000 వరకు పెరూ 54వ అధ్యక్షుడిగా పనిచేసిన అల్బెర్టో ఫుజిమోరి 11 సెప్టెంబర్ 2024న మరణించారు. 86 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత మరణించారు.

పాకిస్థాన్‌కు చెందిన సర్తాజ్ అజీజ్ 2 జనవరి 2024న కన్నుమూశారు. 94 ఏళ్ల ఈ ఆర్థికవేత్త పాకిస్థాన్ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా, పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.

Also Read:నాగబాబుతో అల్లు అర్జున్ భేటి…

- Advertisement -