ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, స్టన్నింగ్ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రఖ్యాత నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్ కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట కే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటివరకు అప్డేట్స్ ఇస్తు వచ్చిన మేకర్స్ తాజాగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే వార్తను అందించారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోండగా షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు ప్రభాస్. ప్రభాస్, ఓ బాలీవుడ్ యాక్టర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన మూడు ప్రధాన సెట్స్‌లో ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతోంది.ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు.
ఏప్రిల్ 2023లో విడుదల కానున్న ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.