Project K:రైడర్స్ ప్రమోషన్స్

68
- Advertisement -

సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది. తర్వాత శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసింది. ప్రభాస్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ K’లో ఇండస్ట్రీ లోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రాజెక్టు కె హంగామా మొదలుకాగా తాజాగా యూఎస్‌లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.

Also Read:Telangana Rains:రెండురోజులు విద్యాసంస్థలకు సెలవు

ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. తాజాగా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ మొదలైంది. రైడర్స్ అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది ప్రాజెక్ట్ K టీం. ఈ సినిమాల్లో వాళ్ళే విలన్ మనుషులు అని సమాచారం.

- Advertisement -