ప్రాజెక్టు k..తగ్గేదేలే అంటున్న నాగ్!

16
nag ashwin

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు k. అమితాబచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎప్పటికప్పుడూ ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇస్తున్న దర్శకుడు….తాజాగా ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ సినిమాకు పనిచేయిస్తూ అంచనాలను పెంచేశాడు.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఒక విభిన్నమైన ఊహా లోకానికి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ మరియు దీపికా కాంబోలో ఇప్పటి వరకు షూట్ చేసిన సన్నివేశాలు మరియు కొన్ని సైన్స్ పిక్షన్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయట. విజువల్ వండర్‌లా తీర్చిదిద్దుకున్న ఈ చిత్రాన్ని విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి..