ప్రాజెక్టు K @ హైదరాబాద్ మెట్రో

72
amitab
- Advertisement -

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రబాస్ – దీపికా పదుకొనే ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్రాజెక్టు K. వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని పలు లొకేషన్లలో సినిమా షూటింగ్ జరుగుతుండగా అమితాబ్ పాల్గొన్నారు.

హైదరాబాద్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అమితాబ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ లో షూటింగ్ లో పాల్గొనగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. భారతీయ భాషల్లోనే కాదు వివిధ దేశాల్లో కూడా వారి భాషలో రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

- Advertisement -