గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రొఫెసర్ మురళిశ్వరరావు..

74
GIC
- Advertisement -

గురువారం తన జన్మదినం సందర్భంగా అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్ రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ మురళిశ్వరరావు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు పర్యావరణవేత్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజు సందర్భంగా అవేర్ గ్లోబల్ హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ల బృందంతో కలిసి పలు రకాల మొక్కలను నాటారు.

గాలిపీల్చుకోవడం మరువనట్టే తమకు ప్రాణవాయువును అందించే మొక్కలను నాటి సంరక్షించి పెంచడం మరవొద్దు అని ప్రొఫెసర్ మురళిశ్వరరావు అన్నారు..రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన మొక్కలు నాటే మహయజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అందరిని కదిలిస్తున్నదని అన్నారు.

హరిత స్పూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.తాను అనేక సందర్భాల్లో ఈ స్పూర్తితో మొక్కలు నాటి సంరక్షిస్తున్నందుకు సంతోషంగా ఉందని డాక్టర్ మురళిశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి కాంతయ్య,డాక్టర్ మార్కండేయులు, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.

- Advertisement -