ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ యూకే ఆద్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యు.కే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టి.ఆర్.యస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాలర్పించి, తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తరువాత సంస్థ ప్రతినిథులు మాట్లాడుతూ,.. తెలంగాణ బావజాల వ్యాప్తిలో జయశంకర్ గారి పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పని చేసారని, అటువంటిది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిన సంతోష సందర్భంలో మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జయశంకర్ సర్ ఆశయ సాధనకై, రాష్ట్ర సాధనకై వారు చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని ఆచార్య గారి మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో తెరాస పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్. యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అద్యక్షుడు-టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ , కార్యదర్శులు హరి నవాపేట్ మరియు సత్య చిలుముల, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి, లండన్ ఇంచార్జులు గణేష్ పాస్తం మరియు భాస్కర్ మొట్టా, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ ప్రశాంత్ కటికనేని, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్ల తో పాటు తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్ బలమూరి, జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధన్నమనేని, టీ.డీ.ఎఫ్ అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్ రెడ్డి తో పాటు వారి ప్రతినిధులు, స్థానిక తెలంగాణ వాదులు కిషోర్ మునగాల తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.