జైలు నుండి బయటకు వచ్చిన 5 నెలల తర్వాత మీడియాతో మాట్లాడారు ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీలో కిడ్నాప్ చేసి.. అక్రమంగా అరెస్టు చేశారని..జైల్లో చిత్ర హింసలు పెట్టారు అన్నారు. ప్రత్యేక రూములో నిర్బంధించి.. వీల్ చైర్‌లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారు అన్నారు.
అక్కడ కుల వ్యవస్థ విచ్చలవిడిగా కనిపిస్తుంది.. కులాన్ని బట్టి పనివ్వండి అని మాన్యువల్‌గా రాసి ఉందని తెలిపారు. జైల్లో ఉండగా నాకు 21 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని తెలిపారు. కోర్టులు కూడా తనకు న్యాయం చేయలేదు ఆరోపించారు.
క్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో దోషిగా నిర్దారిస్తూ జీవిత ఖైదు విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు సాయిబాబా. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది బాంబే హైకోర్టు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరోసారి విచారణ జరపాలని హైకోర్టుకు సూచించింది. బాంబే హైకోర్టు డివిజన్ బెంజ్ విచారణ చేపట్టి సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
Also Read:వరంగల్ కాంగ్రెస్‌లో విభేదాలు..కొండా వర్సెస్ ఎమ్మెల్సీ సారయ్య