ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రొ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన – ఆచార్య జయశంకర్ ఆలోచనలతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ కలలు గన్న తెలంగాణ నిర్మాణం అవుతోందని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ తెలిపారు. – తెలంగాణ సిద్ధాంత కర్తగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిత్యం తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
తెలంగాణ నినాదాన్ని ప్రాణంతో ఉంచిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు కెప్టెన్ లక్ష్మి కాంతారావు. ఎంత దూరమైన తెలంగాణ మీటింగ్ అంటే వెళ్లే వారని… ఏ విషయం చెప్పిన ఆనాడు సీఎం కేసీఆర్ తెలంగాణ వైపే తీసుకువచ్చేవారని చెప్పారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఆయన లేకపోవడం బాధాకరమని… తెలంగాణ అభివృద్ధిపై ఆయన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.
జయశంకర్ సార్ ఆశయాలను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకు పోతున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు.సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతోందని…- తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు అసలు నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలతో పాటు రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి తదితరులు పాల్గొన్నారు.